పొట్టేళ్లకు భలే గిరాకీ.. | - | Sakshi
Sakshi News home page

పొట్టేళ్లకు భలే గిరాకీ..

Oct 12 2024 1:08 PM | Updated on Oct 12 2024 1:08 PM

పొట్టేళ్లకు భలే గిరాకీ..

పొట్టేళ్లకు భలే గిరాకీ..

మహబూబాబాద్‌ అర్బన్‌: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలో పొట్టేళ్లు, గొర్రెలు, మేకలకు గిరాకీ పెరిగింది. ప్రైవేట్‌ కంపెనీలు, వాహన షోరూంలు, ఎలక్ట్రానిక్‌ యంత్రాలు, మోటార్లు, ఇతర షాపుల ఎదుట మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పొట్టేళ్లకు డిమాండ్‌ పెరిగింది. జిల్లాలోని పలు సంతల్లో కొమ్ములు వడి తిరిగిన పొట్టేళ్లను భారీ సంఖ్యలో పెంపకందారులు విక్రయించేందుకు తీసుకొచ్చారు. గతేడాది కంటే ఈ సారి గొర్రె పోతులు, మేకల ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. గొర్రెలు, మేకల వయస్సు, బరువును బట్టి ధరలు రూ. 10వేల నుంచి రూ.30వేల వరకు ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.

నాటు కోళ్లకు..

దసరా పండుగకు నాటు కోళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో కోడిని రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. కాగా మార్కెట్‌లో కిలో మటన్‌ ధర రూ.900 నుంచి రూ.1,200 వరకు ఉండగా, చికెన్‌ ధర కిలో రూ.240 నుంచి రూ.260 వరకు ఉంది.

దసరా పండుగతో పెరిగిన గొర్రెలు, మేకల ధరలు

కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement