పెండింగ్‌ వినతులు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ వినతులు పరిష్కరించాలి

Published Tue, Mar 28 2023 1:46 AM

- - Sakshi

అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

మహబూబాబాద్‌: ప్రజావాణిలో అందిన పెండింగ్‌ వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్‌, డేవిడ్‌ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ.. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అని అధికారులు గుర్తించుకోవాలన్నారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య రాకుండా యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్లాలని సూచించారు. ప్రజావాణిలో 132 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు వీరభద్రస్వామి

హుండీ లెక్కింపు

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నేడు(మంగళవారం) నిర్వహిస్తామని ఆలయ ఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు.

ఆలయ భూముల సర్వే

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ భూములను నేడు(మంగళవారం) సర్వే చేస్తామని ఆలయ ఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళ, బుధవారాల్లో సర్వే నిర్వహిస్తామని వివరించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయనే భావించిన ఆలయ అధికారులు కల్టెకర్‌ శశాంకు ఫిర్యాదు చేయగా ఆయన ఆదేశాల మేరకు సర్వే చేయ డం జరుగుతుందన్నారు. సర్వే నంబర్లు 78, 79, 88, 169, 602, 603, 604, 642లో సర్వే ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

క్రెచ్‌ కేంద్రం ప్రారంభం

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఉద్యోగస్తుల పిల్లల కోసం క్రెచ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా సోమవారం మంత్రి సత్యవతిరాథోడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ శశాంక, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌

దేశానికే ఆదర్శం

మరిపెడ: సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. సోమవారం మరిపెడలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. డోర్నకల్‌ నియోజక వర్గం అంటే రెడ్యానాయక్‌ సొంత ఇల్లు అన్నారు. ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.అనంతరం మాజీ ఎమ్మెల్సీ సతీష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌, డీఎస్‌ రవిచంద్ర, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు అరుణరాంబాబు, పద్మ వెంకటరెడ్డి, మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ గుగులోతు సింధూరరవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement