
డీజీపీకి సంపత్ ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదు
జనగామ: తప్పు చేసింది ఒకరు.. జరిమానా చెల్లించాలని నోటీసులు మరొకరికి. ఈట్విస్ట్‌ను ట్విట్టర్‌లో డీజీపీకి జనగామ వాసి ఫిర్యాదు చేశారు. జనగామలోని జయశంకర్‌నగర్‌కు చెందిన పబ్బా సంపత్‌కు (టీఎస్ 27 సీ4258) నంబర్‌గల ద్విచక్రవాహనం ఉంది. స్థానికంగా ఉండే సంపత్ ఈమధ్య కాలంలో బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్లలేదు. ఎల్‌బీనగర్ ట్రాఫిక్ పోలీస్టేషన్ పరిధిలో ఓ స్కూటీ యజమాని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పాటు విరిగిపోయిన నంబర్ ప్లేట్ కనిపించడంతో పోలీసులు రూ.7వందల జరిమానా విధించారు. కానీ ఆన్‌లైన్‌లో స్కూటీ నెంబర్ ప్లేట్ విరిగి ఉన్న ఫోటోను పోస్టు చేసి, జరిమానా మాత్రం జనగామకు చెందిన సంపత్‌కు మెసేజ్ పంపించారు. దీన్ని చూసి ఆందోళన చెందిన సంపత్... నేరుగా డీజీపీకి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీఅయ్యా డీజీపీ గారు... బండి నంబర్ కనిపించకపోతే ఎవరికి పడితే వారికి జరిమానా విధిస్తారా? మీరు ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన బైక్ మాది కాదు.. సరి చూసుకోండిశ్రీ అంటూ ట్వీట్ చేశారు.
డీజీపీకి ట్విట్టర్‌లో
జనగామ వాసి ఫిర్యాదు

జరిమానా చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు పంపించిన చలాన్