కేయూ మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీపతి మృతి | Sakshi
Sakshi News home page

కేయూ మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీపతి మృతి

Published Tue, Mar 28 2023 1:42 AM

-

కేయూ క్యాంపస్‌: కేయూ జూవాలజీ విభాగం విశ్రాంత ఆచార్యులు, మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య వడ్లకొండ లక్ష్మీపతి(78) హైదరాబాద్‌లో సోమవారం మృతి చెందారు. మార్నింగ్‌ వాక్‌ చేస్తూ గుండెపోటుతో మరణించారని సమాచారం. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. లక్ష్మీపతి కేయూ రిజిస్ట్రార్‌గా 2003 నుంచి 2005 వరకు పని చేశారు. జువాలజీ విభాగంలో దాదాపు 30 ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పని చేశారు. ఆయన ఉద్యోగ విరమణ పొందాక యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, నైపర్‌, ఫార్మసీ సంస్థలో అతిథి ఆచార్యులుగా పని చేశారు. లక్ష్మీపతి మృతికి కేయూ వీసీ తాటికొండ రమేశ్‌, రిజిస్ట్రార్‌ టి.శ్రీని వాస్‌రావు, జువాలజీ విభాగాధిపతి మామిడాల ఇస్తారి సంతాపం తెలిపారు.

ఇద్దరికి జీవిత ఖైదు

నర్సింహులపేట: చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో 2014లో కుటుంబ తగాదాలతో కుంట యాదగిరిని హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులకు సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ఎస్సై మంగీలాల్‌ తెలిపారు. యాదగిరి హత్యకు గురైనట్లు డిసెంబర్‌ 2014లో ఆయన కుమారుడు నరేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే గ్రామానికి చెందిన కుంట సురేశ్‌, చిల్ల ఉప్పలయ్యను నిందితులుగా పేర్కొని జిల్లా కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. నిందితులిద్దరికీ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ రూ.1000 జరిమానా, జీవిత ఖైదు విధించినట్లు ఎస్సై తెలిపారు. ఈకేసులో ట్రయల్‌ నడిపిన పీపీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ రఘు, సీఐ సత్యనారాయణ, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ ఎండి.గాలీబ్‌, ఎస్సై మంగీలాల్‌, కోర్టు పీసీ నరేందర్‌ను ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ అభినందించారు.

లక్ష్మీపతి(ఫైల్‌)

Advertisement
Advertisement