
అకాడమిక్ కార్యక్రమాలపై చర్చేది?
కేయూలో సెనేట్ సభ్యుల కొరత ఉంది. యూనివర్సిటీకి 16 ఏళ్ల క్రితం సెనేట్ సభ్యులను నియమించారు. కనీసం ఐదారేళ్లకోసారి సెనేట్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. కానీ రీ ఆర్గనైజ్ చేయడం లేదు. పలువురు సెనేట్ సభ్యులు మరణించినా.. వారి స్థానంలో కొత్తవారిని నియమించడంలేదు. సెనేట్‌ను కొత్తగా పునరుద్ధరించాలనే డిమాండ్ వ్యక్తం అవుతున్నా.. యూనివర్సిటీ అధికారులు అంతగా.. పట్టించుకోవడం లేదు. అకాడమిక్ సెనేట్, బడ్జెట్‌ను కలిపి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక కొద్దిసేపు చర్చించిన అనంతరం చప్పట్లతో ఆమోదించినట్లుగా ప్రకటిస్తున్నారు. అకాడమిక్ కార్యక్రమాలకు విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా చర్చించాలనేది ప్రతీ సెనేట్ సమావేశంలో పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు ఓకే అనడం ఆతర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. అకాడమిక్ సెనేట్‌లో ఎప్పుడూ పూర్తి స్థాయిలో అకాడమిక్ కార్యక్రమాలపై చర్చలు జరగలేదంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం 45 మంది అకాడమిక్ సెనేట్ సభ్యులున్నట్లు తెలుస్తోంది. అందులో ఎంతమంది హాజరవుతారో మంగళవారం తెలియనుంది.
కేయూ క్యాంపస్: కేయూ 2023–24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక అంచనాల బడ్జెట్ రూ.389 కోట్లకుపైగా ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. మంగళవా రం ఉదయం 11 గంటలకు 38వ అకాడమిక్ సెనేట్‌లో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈబడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్ రూపేణారూ 127.55 కోట్లు రానున్నాయి. ఆనిధులు అధ్యాపకుల, నాన్‌టీచింగ్, పెన్షనర్ల జీతభత్యాలకే సరిపోనున్నాయి. మిగతా అంచనా బడ్జెట్‌కు అనుగుణంగా కేయూ అంతర్గత నిధుల నుంచి, పరీక్షల విభాగం, ఎస్‌డీఎల్‌సీఈ, ఎస్‌ఎఫ్‌సీ కోర్సుల నుంచి ఇతర అకాడమిక్ పరంగా ఫీజుల వనరుల నుంచి సమీకరించబోతున్నారు. ఆయా నిధులను వ్యయాలుగా చూపెట్టబోతున్నారు. ప్లానింగ్, నాన్‌ప్లానింగ్ బడ్జెట్‌గా 8 అంశాల్లో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే బ్లాక్‌గ్రాంట్ అధ్యాపకుల, ఉద్యోగుల వేతనాలకే సరిపోతుండగా.. టైంస్కేల్, తాత్కాలిక ఉద్యోగులకు మాత్రం.. యూనివర్సిటీ తన అంతర్గత నిధుల నుంచే వేతనాలను చెల్లించుకోవాల్సిన పరిస్థితి. టీచింగ్, నాన్‌టీచింగ్ పెన్షనర్ల బెనిఫిట్స్‌ను కూడా యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచే ఇవ్వాల్సి వస్తోంది. ఆబెనిఫిట్స్ ఇవ్వడంలోనూ జాప్యం అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే బ్లాక్‌గ్రాంట్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో బ్లాక్‌గ్రాంట్ రూ.9.34 కోట్లు పెరిగింది. అయినప్పటికీ ఇది సరిపోదు. అలాగే.. అధ్యాపకుల, ఉద్యోగులకు పీఆర్సీతో వేతనాలు పెరిగాయి. డీఏలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 కోట్లకు పైగా లోటు బడ్జెట్‌ను చూపెట్టబోతున్నట్లు సమచారం. కాగా.. అన్ని కోర్సులకు ఫీజులు భారీగానే పెంచారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తే కొంత యూనివర్సిటీకి ఊరట కలిగే అవకాశం ఉంది.
కేయూ అంచనా బడ్జెట్ రూ.389 కోట్లు!
రూ.15 కోట్లకుపైగా లోటు బడ్జెట్ చూపే అవకాశం
నేడు అకాడమిక్ సెనేట్ సమావేశంలో
బడ్జెట్‌పై చర్చ, ఆమోదం