
చికిత్స పొందుతున్న విద్యార్థి ధరణి
● కేయూ రిజిస్ట్రార్ టి.శ్రీనివాస్‌రావు
కేయూ క్యాంపస్: కేయూ సెనేట్‌హాల్‌లో ఈనెల 28న ఉదయం 11గంటలకు జరిగే 38వ అకాడమిక్ సెనేట్ సమావేశంలో పద్దుల ఆమోదం, వార్షిక నివేదిక, వార్షిక బడ్జెట్ అంచనాల సమర్పణ ఉంటుందని సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసమావేశంలో 2020–2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దుల ఆమోదం, 2023–24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ అంచనాల సమర్పణ ఉంటుందని పేర్కొన్నారు. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ మినట్స్‌ను కూడా ఉంటుందని తెలిపారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల డీన్‌లు, ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్ష రాస్తున్న
విద్యార్థికి ఫిట్స్
ఎంజీఎంకు తరలింపు
ఎంజీఎం: వరంగల్ ఏవీవీ కళాశాలలో మేధా ఇంటర్మీడియట్ కళాశాలకు చెందిన ధరణి సోమవారం ఇంటర్ పరీక్ష రాస్తున్న క్రమంలో ఫిట్స్ వచ్చింది. కళాశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తీసుకెళ్లి చికిత్స అందించారు. విద్యార్థి తల్లిదండ్రులు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కూతురును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.