
పరిశీలిస్తున్న ఏసీపీ సంపత్‌రావు
చెన్నారావుపేట: ఈనెల 17న కుమారుడి వివాహం జరిగింది. నూతన వధూవరులతో ఆ కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లింది. వచ్చేసరికి దొంగలు ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. మండలంలోని కోనాపురానికి చెందిన మండల సుధాకర్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శోభ–సుధాకర్ దంపతులు ఈనెల 17న తమ కుమారుడు నాగరాజు వివాహాన్ని జరిపించారు. నూతన వధూవరులను తీసుకొని వేములవాడకు ఆదివారం వెళ్లారు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి అందులో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, సీఐ హతీరాంనాయక్, ఎస్సై తోట మహేందర్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో చోరీ తీరుపై విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ అధికారులు వేలిముద్రల నమూలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తోట మహేందర్ తెలిపారు.
కోనాపురంలో దొంగల బీభత్సం
10 తులాల బంగారం,
రూ.2 లక్షల నగదు అపహరణ