
సమావేశంలో మాట్లాడుతున్న గురువారెడ్డి
ఖిలా వరంగల్ : మోదీ మతోన్మాద ఫాసిజాన్ని కేసీఆర్ నిరంకుశ విధానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్ ఆర్. గురువారెడ్డి కోరారు. ఆదివారం ఖిలా వరంగల్ ఫోర్ట్‌రోడ్‌లోని అన్నపూర్ణ కల్యాణమండపంలో తీగల జీవన్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిజాన్ని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రగతిశీల శక్తులంతా ఐక్యంగా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బండి కోటేశ్వర్, తీగల జీవన్‌గౌడ్, నలిగంటి చంద్రమౌళి, స్వామి, కొత్తపల్లి రవి, సాగర్ ముంజాల భిక్షపతి, గద్దల డానియల్, బెల కుమారస్వామి పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల
కన్వీనర్ గురువారెడ్డి