
యోగాగురువును సన్మానిస్తున్న డీఈఓ
మహబూబాబాద్ అర్బన్: యోగ అనేది శరీరానికి, మనసుకు పూర్తి పనిని అందించే అత్యంత పురాతనమైన వ్యాయమమని, యోగా వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని డీఈఓ పి.రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో యోగ శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగ గురువు నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఏసీజీఈ అధికారి మందుల శ్రీరాములు, ఏఏంఓ కోఆర్డినేటర్ బుచ్చయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సమన్వయం పాటించాలి
మహబూబాబాద్ రూరల్: శ్రీరామ నవమి, ఈస్టర్, రంజాన్ పండుగల సందర్భంగా అన్ని కులాలు, మతాలవారు సమన్వయం పాటించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఇన్‌చార్జ్ డీఎస్పీ రమణబాబు అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీసుస్టేషన్ సమావేశ మందిరంలో వివిధ కులమతాల పెద్దలతో శనివారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. టౌన్ సీఐ సతీష్, ఎస్సైలు గోపి, దీపికరెడ్డి, రవి పాల్గొన్నారు.