
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ శశాంక
మహబూబాబాద్: ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండేందుకే ఆరోగ్య మహిళ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో శనివారం ఆరోగ్య మహి ళ లక్ష్యాల సాధింపుపై సంబంధిత అధికారులతో ని ర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రతి మహిళకు ఆరోగ్య మహిళలో భాగంగా చేపడుతున్న ఎని మిది టెస్ట్‌లను తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ప్ర తి పీహెచ్‌సీ 100 పరీక్షలు నిర్వహించాల ని ఆదేశించారు. జిల్లాలో ఐదు పీహెచ్‌సీల్లో మహిళా డాక్టర్లు ఉన్నారని ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ఉందని ఉచితంగా 57 రకాల పరీక్షలు నిర్వహించవచ్చని శాంపిల్స్ ఎక్కువగా సేకరిస్తూ పరీక్షలు ఎక్కువగా చేయాలన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ రమాదేవి, డీఆర్‌డీఓ సన్యాసయ్యా, ఎంహెచ్‌ఓ హరీశ్ రాజ్ పాల్గొన్నారు.
పక్కా ప్రణాళికతోనే అభివృద్ధి
మరిపెడ: మున్సిపాలిటీల అభివృద్ధికి పక్కా ప్రణాళి క రూపొందించాలని కలెక్టర్ శశాంక అన్నారు. మరిపెడలోని ఆడిటోరియంలో శనివారం మరిపె డ, డోర్నకల్ మున్సిపాలిటీల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కే టాయింపులకు తగ్గట్టుగా ఖర్చు పెట్టేందుకు పన్ను ల వసూలు రూపకల్పన జరగాలన్నారు. మున్సిపాలిటీలకు కేటాయించిన రూ.కోట్లు ప్రజల అవసరాలు గుర్తించి ఖర్చు చేయాలన్నారు. డోర్నకల్‌లో జంక్షన్ ఏర్పాటుతోపాటు ఆర్చి నిర్మాణం చేపట్టాల ని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్, మరిపెడ, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్లు సింధూరరవికుమార్, వాంకుడోతు వీరన్న, మున్సిపల్ కమిషనర్లు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శశాంక