
– 8లోu
బలగానికి మరింత బలం ‘వేణు’
బలగం సినిమా చూస్తున్నంత సేపు మట్టి మనుషుల వాసనొస్తుంది. మానవ సంబంధాల పరిమళం గుభాళిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే సినిమాలో లీనమైపోతాం. అలా చేయడంలో దర్శకుడి పాత్ర ఎంతుందో.. సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా అంతే ఉంది. షాట్‌ను ఎలా చిత్రీకరించాలి? ఏ లొకేషన్‌లో ఏ కెమెరా వాడాలి. లైట్స్ వినియోగం.. లొకేషన్ సెట్టింగ్ ఇలా బలగం సినిమాకు సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు మరింత బలం చేకూర్చారు. వేణుది భూపాలపల్లి జిల్లా రంగయ్యపల్లి. కోల్‌కతాలోని ప్రఖ్యాత సినీరంగ బోధన సంస్థ ‘సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్’లో మోషన్ ఫొటోగ్రఫీలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. మొదటి చిత్రం గారో భాషలో ‘మా.. అమా’ సినిమా ద్వారా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ‘ఏషియన్ న్యూ టాలెంట్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆతర్వాత జెర్సీ సినిమాకు పనిచేశారు. టాలీవుడ్‌లో బలగం సినిమాకు పూర్తి స్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా చేశారు. సినిమా విజయంలో భాగమయ్యారు.
పాటల ఊట ‘శ్యామ్’
హనుమకొండ బ్రాహ్మణవాడలోని కాసర్ల మధుసూదన్, మాధవి దంపతుల కుమారుడు శ్యామ్. చిన్నతనంలోనే జానపద కళాకారులు సారంగపాణి, శంకర్‌ను అనుసరిస్తూ అనేక జానపదాలు రాశారు. అంతటితో ఆగకుండా సినీ రంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు 300లకు పైగా పాటలు రాశారు. ప్రతి పాట వన్స్‌మోర్ అనేలా ఉండడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇందులో ‘రాములో.. రాములా.. డీజే టిల్లూ పేరు.. నీలపురి గాజుల ఓ నీలవేణీ.. నిన్ను చూడబుద్ధి అవుతుంది రాజిగో.. ఇలా అనేక పాటలు రాశారు. బలగం సినిమాలో అన్ని పాటలు రాయడమే కాదు.. సినిమాలో పాత్రల ఎంపిక, షూటింగ్, సన్నివేశాలు.. ఇలా అన్ని విషయాల్లో దర్శకులు వేణుకు సహకారం అందించారు.
చిన్న చిన్న సమస్యలతో తోబుట్టువులను, మన కోసం పరితపించే పుట్టెడు బలగాన్ని కొందరు దూరం చేసుకుంటున్నారు. తిరిగి అందరూ కలిస్తే కలిగే బలమే ‘బలగం’. గ్రామీణ జీవితం ఇతివృత్తంతో ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఇంట్లో జరిగే గొడవలు.. అనుబంధాలతో తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ థియేటర్‌కు రప్పించి.. కన్నీరు పెట్టించింది. ఇంత గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించిన సినిమాలో మన బలగం (ఓరుగల్లు కళాకారులు) కీలకపాత్ర పోషించింది. వారిపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
పౌష్టికాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
కురవి: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అని ట్రైనీ కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మండలంలోని నల్లెల్ల గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మానుకోట మాత శిశు మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను పరి శీలించారు. చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు, చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ వరలక్ష్మీ, సీడీపీఓ ఎల్లమ్మ, సూపర్‌వైజర్ రమణ, స్కూల్ టీచర్ బాబురావు, అంగన్‌వాడీ టీచర్లు ఉపేంద్రమ్మ, అనసూయ, సుభద్ర, శ్రీమతమ్మ, శారద, రాంబాయి, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఏఎంసీ పాలకవర్గ
ప్రమాణస్వీకారం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఏఎంసీ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఏఎంసీ సెక్రటరీ రాజేందర్ శనివారం తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌గా కత్తెరసాల విద్యాసాగర్, వైస్ చైర్మన్‌గా గుండా రాజశేఖర్, పాలకవర్గ సభ్యులుగా కత్తుల ఎలేందర్, ధరావత్ బాలు, సామ భిక్షం, కందుల నరేష్, బొంత వెంకన్న, చెన్నబోయిన ఆంజనేయులు, భూక్య సరియా, ముక్కల వెంకన్న, కలకోట రాము, గార్లపాటి భరద్వాజ్, పావుశెట్టి సాంబశివరావు, గార్లపాటి మహిపాల్ రెడ్డి నియామకం అయ్యారు. వీరితోపాటు జిల్లా వ్యవసాయ అధికారి భూక్య చత్రునాయక్, ఏడీఏ ఎం.లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కూడా నియామకమైనట్లు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, జిల్లా రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఎస్.రవిచంద్ర హాజరవుతున్నారని తెలిపారు.
పల్లె దవాఖానాల్లో
మెరుగైన సేవలందించాలి
గూడూరు: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లె దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అంబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని సబ్ సెంటర్‌తో పాటు భూపతిపేట పల్లె దవాఖానను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కరోనా మళ్లీ పెరుగుతుందని, ప్రజలకు సేవలందించడంతో పాటు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలతో పాటు కంటి వెలుగును విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వడ్డెబోయిన శ్రీనివాస్, ఏఎన్‌ఎం ప్రమీల, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే కష్టాలు తీరుతాయి
కేసముద్రం: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే, పేద ప్రజల కష్టాలు తీరుతాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ మురళీనాయక్ అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం మండలంలోని తాళ్లపూసపల్లి, అన్నారం, వెంక్యాతండా, ధర్మారంతండాల్లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
మైమరిపించిన ‘మధు’
హనుమకొండ పట్టణంలోని భీమారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి ఓదెలు, వినోదల కుమారుడు మధుసూదన్(మధు). చిన్నప్పటి నుంచే మైమ్ కళాకారుడిగా వేలాది స్టేజీ షోలు ఇచ్చారు. ప్రపంచ మైమ్ ప్రదర్శనల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యారు. ప్రపంచ మైమ్ థియేటర్‌కు ఎంపికై న రెండో ఆసియావాసిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సంగీత, నాటక, రంగస్థల అవార్డు గ్రహీతగా, నాటకరంగంలో అతి చిన్న వయస్సులోనే ఉత్తమ నంది అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సినిమా, నాటక, టీవీ అనేక రంగాల్లో రాణిస్తున్న కళాకారుడు మైమ్ మధు. బలగం సినిమాలో కొమురయ్య చిన్నకొడుకు మొగిలయ్య పాత్రలో నటించారు. బతుకుదెరువు కోసం సూరత్ వెళ్లిన అతను తండ్రి చనిపోగానే ఇంటికి రావడం, అన్నాదమ్ముల మధ్య పంచాయితీ, అనుబంధం, డబ్బులు లేమితనం దృశ్యాల్లో కళ్లకు కట్టినట్లు నటించారు.
– సాక్షి, మహబూబాబాద్/దుగ్గొండి
జానపదం.. సినిమాకు ప్రాణపదం!
దుగ్గొండి: ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడికెళ్లినావు కొంరయ్యా..’ అంటూ తంబుర, దిమ్మిసతో పాడిన పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసి కంటనీరు పెట్టించింది. ఈ పాట పాడింది.. ఎవరో కాదు.. మన వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగ జంగాలు పస్తం మొగిలయ్య– కొంరమ్మ దంపతులు. బలగం సినిమా డైరెక్టర్ వేణు తన సినిమాలో జానపద కళలు, కళారూపాలకు ప్రాతినిథ్యం కల్పించాలని సింధు కళాకారులు, మందహెచ్చలు, బుడిగ జంగాల కళాకారులతో పాడించారు. ఇదే తరుణంలో.. దుగ్గొండికి వచ్చి పస్తం మొగిలయ్య–కొంరమ్మతో అనేక రకాల దరువులతో పాటలు పాడించుకున్నారు. దరువులు నచ్చాయని చెప్పి వెళ్లి 30 రోజులకు అందిన పిలుపుతో దంపతులిద్దరూ హైదరాబాద్ వెళ్లి 14 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. బలగం సినిమా చివరలో మొగిలయ్య–కొంరమ్మలు పాడిన పాట హిట్‌గా మారి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.
కంట తడిపెట్టించి... పుట్టెడు కష్టాల్లో
తమ పాట ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఏడాది క్రితమే ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది. రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో డయాలసిస్ ద్వారా జీవనం సాగిస్తున్నాడు. రెండు కళ్లు చూపు కోల్పోయాయి. సినిమా విజయవంతమవడంతో సంబరాలు జరుపుకోవాల్సిన మొగిలయ్య కుటుంబం ఇప్పుడు పుట్టెడు కష్టాలతో జీవనం సాగిస్తోంది.
పాత్రకు ప్రాణం పోసిన ‘ప్రభాకర్’
వరంగల్ పట్టణంలోని గేటు కింద ఏరియాలో నివాసం ఉండే సీనియర్ కళాకారులు వేముల ప్రభాకర్. యాభై ఏళ్లుగా కళామతల్లినే నమ్ముకొని జీవిస్తున్నారు. సమాజంలోని రుగ్మతలను పారదోలేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామ గ్రామాన తిరిగి నాటక ప్రదర్శనలు చేశారు. బలగం సినిమాలో గ్రామ పెద్ద పాత్రకు జీవం పోశారు. తెలంగాణలోని గ్రామ పెద్దలు, కట్టుబాట్లను తెలిపే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బీమ్స్.. అదుర్స్..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన బీమ్స్‌కు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం, పాడడం అలవాటు. ఈ ఇష్టంతోనే సినిమా రంగంలో ప్రవేశించారు. ‘బాబూ ఓ రాంబాబు’తోపాటు అనేక పాటలు రాసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బలగం సిని మాకు సంగీత దర్శకుడిగా పనిచేసి ప్రతి పాటను వీనుల విందుగా తీర్చిదిద్దారు. బ్యాక్‌గ్రౌండ్ పాటలకు సైతం సన్నివేశాలకు తగిన విధంగా సంగీతం అందించారు.
బంధాన్ని గుర్తు చేసిన ‘బాబు’
బలగం సినిమాలో మరో కీలక పాత్రలో అద్భుత నటన ప్రదర్శించి జీవం పోసిన గుడిబోయిన బాబుది వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం. సాంఘిక, సామాజిక చైతన్య నాటకాలు, తొమ్మిది సినిమాల్లో నటించారు. బలగం సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజయ్య పాత్రలో నటించాడు. అన్న కొడుకులు పంచాయితీ పెట్టుకుంటే.. కనీసం సమాధి కట్టేందుకు నాలుగు గజాల జాగా కాడ కూడా గొడవ పెట్టుకోవడం చూసి తల్లడిల్లిపోయిన పాత్రతో సినిమా చూసిన వారికి కంట తడి పెట్టించారు.
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీ పరిధి లో 3000 నుంచి 4000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఇతరత్రా నిర్మాణాలకు స్థలాల కొరత నెలకొందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రభుత్వ భూమిలోని ఇళ్లకు క్రమబద్దీకరణ పత్రాలను స్థానిక గిరిజన భవనంలో శనివారం తహసీల్దార్ నాగభవాని ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షత వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని కొని యాడారు. కమ్యూనిస్టులంటే తనకు చాలా గౌరవం ఉందని వారిలో కొంతమంది భూ సమస్యలు సృష్టిస్తున్నారని, మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన భూమిని ప్రభుత్వమే పేదలకు పంపిణీ చేస్తుందన్నారు. జీఓ 58, 59లో దరఖాస్తు చేసుకుని పట్టాలు రాని వారి విషయంలో మ రోసారి సర్వే చేయించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. 2015లోనే ప్రభుత్వం జీఓ 58, 59ను విడుదల చేసిందని సు మారు 750 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో జీఓ 58లో 672 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని జీఓ 59లో 374 అర్హులు ఉన్నా కేవలం 9 మంది మాత్ర మే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ ఒ కటి నుంచి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఎమ్మె ల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ..125 గజాలలోపు ఉచితంగా పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్‌సారథిరెడ్డి మరోసారి సర్వే చేయించి పేదలకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్ ప్రసన్నరాణి, ఉద్యావన శాఖాధికారి సూర్యనారాయణ, కౌన్సిలర్లు వెంకన్న, శ్రీదేవి, పుష్పలత పాల్గొన్నారు.
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి
● జెడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో చైర్‌పర్సన్ బిందు
మహబూబాబాద్ అర్బన్: ప్రభు త్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం జెడ్పీ స్థా యి సంఘాల సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, బండి వెంకట్‌రెడ్డిలు హాజరై మాట్లాడారు. జిల్లాలో గ్రామపంచాయతీలు, సర్పంచ్‌లు, కార్యదర్శులకు అవార్డులు రావడం సంతోషకమరన్నారు.
● జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, గంగారం జెడ్పీటీసీ ఈసం రమ మాట్లాడుతూ.. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని చెప్పారు. కుక్కలకు, కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలన్నారు.
● మరిపెడ జెడ్పీటీసీ తేజావత్ శారద, గూడురు జెడ్పీటీసీ గుగులోత్ సుచిత్ర మాట్లాడుతూ.. సీ్త్ర, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ,సఖి కేంద్రం నిర్వాహకులు లైంగిక, మానసిక, శరీరక హింసలపై అవగహన కల్పించాలన్నారు.
● మానుకోట జెడ్పీటీసీ ప్రియాంక, డోర్నకల్ జెడ్పీటీసీ కమల మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని తెలిపారు. డిప్యూటీ సీఈఓ నర్మద, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెరవెనుక, తెరపైన ఓరుగల్లు కళాకారులు
ప్రతీ పాత్రలోనూ జీవించిన నటులు
పాటల రచయిత, సంగీతం, సినిమాటోగ్రఫీ మన వాళ్లే
కంటతడి పెట్టించిన మొగిలయ్య–కొంరమ్మల పాట
న్యూస్‌రీల్
ప్రభుత్వ భూమి రికార్డులకే పరిమితం
అన్యాక్రాంతం కాకుండా
చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కొరత
మంత్రి సత్యవతి రాథోడ్



పట్టాలను పంపిణీ చేస్తున్న మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే



సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి







