
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ రాష్ట్ర వినియోదారుల మండలి మహిళా విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా హనుమకొండలోని గోపాలపురానికి చెందిన సాగంటి మంజుల నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని వినియోగదారుల మండలి రాష్ట్ర కార్యాలయంలో మంజులకు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రావ్య నియామక పత్రం అందించారు. వినియోగదారుల్లో చైతన్యం పెంపొందించి, హక్కుల పరిరక్షణకు తనవంతుగా కృషి చేస్తానని, ఈ నియామకానికి స హకరించిన రాష్ట్ర అధ్యక్షుడు సీతారాజ్‌కుమార్‌కు మంజుల కృతజ్ఞతలు తెలిపారు.
పంట రక్షణ ప్రాణం తీసింది
● కరెంట్ ఫెన్సింగ్‌కు రైతు బలి
పాలకుర్తి టౌన్: ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే క్రమంలో అడవి జంతువుల బారిన పడకుండా నివారణ చర్యలు చేపట్టే అన్నదాతల ప్రాణాలు గాలి లో కలుస్తున్న దుర్ఘటన మ రోసారి పాలకుర్తి మండలం చెన్నూరులో చో టు చేసుకుంది. ఎస్సై యాకుబ్ హుస్సేన్ తె లిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పా లకుర్తి మండలంలోని చెన్నూరుకు చెందిన బాలబోయిన నాగరాజు (35) అనే వ్యక్తి వ్యవసాయంతో పాటు ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు. తన పంటను నాశనం చేస్తున్న పందులు, కోతుల నివారణకు పంట చేను చుట్టూ కరెంట్ లైన్ బిగించాడు. శనివా రం పొలంలో యూరియా చల్లే క్రమంలో ప్ర మాదశాత్తు కరెంట్ వైరుకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కోమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా ఈనెల 9న వావిలాల గ్రామానికి చెందిన సోమయ్య కూడా పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే నెలలో ఇద్దరు రైతులు బలి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నియామక పత్రం అందుకుంటున్న మంజుల