మృతదేహాలనే మార్చేశారు..

ఎంజీఎం: వరంగల్‌ ఎంజీఎం మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యంతో శనివారం అనూహ్య ఘటన చోటు చే సుకుంది. రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు తమ ఇళ్లకు తీసుకెళ్లి మృతదేహాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమ బిడ్డ చనిపోయాడని రోదించే క్రమంలో పోస్టుమార్టం సిబ్బంది కట్టిన కట్టు విప్పి చూసే సరికి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో ఇరువురు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తానేదార్‌పల్లికి చెందిన రాగుల రమేశ్‌ (33) శుక్రవారం కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అశాడపు పరమేశ్‌ (45) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో పరమేశ్‌ మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శనివారం పోలీసుల పంచనామా అనంతరం రెండు మృతదేహాలకు ఫోరెన్సిక్‌ వైద్యులు పో స్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయిలో మృతదేహాలకు క ట్టు కట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయి తే మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి రోదిస్తున్న క్ర మంలో కట్టు విప్పి చూడగా మృతదేహం తమది కా దని భావించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు ల సహాయంతో మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మార్చురీ సి బ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరి మృతదేహాలను వారికి అప్పగించారు. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఒకరి మృతదేహాన్ని మరొకరికి ఇచ్చిన ఎంజీఎం మార్చురీ సిబ్బంది

ఇంటికి వెళ్లి చూశాక ఖంగుతిన్న

బంధువులు

మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల

ఆందోళన

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం: ఎంజీఎం అధికారులు

Read latest Mahabubabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top