
అంతిమ యాత్రలో పాల్గొన్న న్యూడెమోక్రసి నాయకులు
కొత్తగూడ/నర్సంపేట/ఎంజీఎం: కమ్యూనిస్టు విప్లవ సంఘాల నాయకురాలు బేబక్క (నిమ్మగడ్డ సరోజన) (83) అకాల మృతి భారత విప్లమ ఉద్యమాలకు తీరని లోటని పలువురు నాయకులు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లిలో శుక్రవారం అనారోగ్యంతో బేబక్క మృతి చెందగా శనివారం అంతిమ యాత్ర నిర్వహించారు. ఆమెను చివరి చూపు చూసేందుకు పలు గ్రామాల నుంచి ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, న్యూడెమోక్రసి నాయకులు భారీగా తరలి వచ్చారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బేబక్క మృతదేహానికి నివాళులర్పించారు. శ్రీశైలం, బూర్క వెంకటయ్య, యాదగిరి యుగేందర్, చంద్రన్న, ప్రభాకరన్న, బండారి అయిలన్న, నాయకులు నాగమల్లేశ్వర్‌రావు, వజ్జ సారయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బేబక్క భౌతికాయానికి శనివా రం పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చంద్రన్న, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి రవి, ముంజంపల్లి వీరన్న, డివిజన్ నాయకులు కోడం సారంగం, అడ్డూరి రాజు, కత్తుల కొమరన్న, ఎంసీపీఐ(యూ) జాతీ య ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ తది తరులు బేబక్క మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
కేఎంసీకి మృతదేహం అప్పగింత
అనారోగ్యంతో మృతి చెందిన బేబక్క మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు, శరీర అవయవ దాతల అసోసియేషన్ సభ్యులు శనివారం కేఎంసీకి అప్పగించారు. గుండంపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల ప్రజలు కేఎంసీకి భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.