‘పెట్రో’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

‘పెట్రో’ కష్టాలు

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

శ్రీగిరిలో భక్తుల రద్దీ

కోసిగి: పెట్రోల్‌ దొరకక వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్టాక్‌ లేకపోవడంతో కోసిగిలో మూడు రోజులుగా హెచ్‌పీ, నయారా పెట్రోలియం బంకులు మూతపడ్డాయి. కేవలం ఇండియన్‌ పెట్రోలియం బంక్‌లో మాత్రమే పెట్రోల్‌ను పోస్తున్నారు. దీంతో ద్విచక్రవాహనాలతో ప్రజలు బారులుదీరాల్సి వస్తోంది. వేసవికాలం కావడంతో ఎండ వేడిమికి తాళలేకపోతున్నారు. పెట్రోల్‌ బంక్‌ పరిసరాల్లో కనీస తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడుతున్నారు. అధికారులు స్పందించి కోసిగిలో ఉన్న మూడు పెట్రోలియం బంక్‌లలో పెట్రోల్‌, డీజిల్‌ సమస్యలు లేకుండా చూడాలని వాహనదారులు కోరారు.

పీఐయూ డీఈఈగా సతీష్‌కుమార్‌

కర్నూలు(అర్బన్‌): పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం పీఐయూ ( ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌ ) కర్నూలు సబ్‌డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా ఆర్‌ సతీష్‌కుమార్‌కు పూర్తి అధనపు బాధ్యతలు అప్పగిస్తు పీఆర్‌ ఈఎన్‌సీ బాలునాయక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పీఐయూ రెగ్యులర్‌ డీఈఈగా విధులు నిర్వహించిన ఎస్‌ మహేశ్వరరెడ్డి ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలోనే సతీ ష్‌కుమార్‌కు డీఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. డీఈఈగా సతీష్‌కుమార్‌ నియమితులు కావడంపై సహచర డీఈఈలు, ఏఈ, ఏఈఈలు, కార్యాలయ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నేడు పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో నూ ప్రజలను ఫిర్యాదులను స్వీరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీల పరిష్కార సమాచారం కోసం 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్‌

హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు ఆదివారం రాత్రి 8 గంటలకు టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ ఏడాది డ్యాంలో కొత్త క్రస్టుగేట్ల ఏర్పాటుకు సంబంధించి ఎల్లెల్సీకి జనవరిలో నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు తాగునీటి అవసరాల నిమిత్తం ఏప్రిల్‌ 3న విడుదల చేశారు. దాదాపు నెల రోజుల పాటు నీటిని వదిలిన అధికారులు ఆదివారం తిరిగి బంద్‌ చేశారు.

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తజనం తరలివచ్చింది. వేకువజామునుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు.

Advertisement
 
Advertisement
Advertisement