
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలవనరుల శాఖ అతిథిగృహం ఆవరణలో గురువారం ఓ కారు మంటల్లో దగ్ధమైంది. సున్నిపెంటలోని వైజాగ్ క్యాంప్‌కు చెందిన కె.నాగమల్లికార్జున కారును స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌ఐ రాజేష్ కు అద్దెకు ఇచ్చాడు. సాయంత్రం ఆయన కారు ను స్టార్ట్ చేయగా అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. ఫైర్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ శ్రీశైలం నుంచి రావడానికి ఆలస్యం కావడంతో ఇక్కడున్న సిబ్బంది బకెట్లతో నీళ్లను చల్లి కొంత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.