
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
దేశానికే రోల్ మోడల్‌గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిని రైతుసేవా కేంద్రాలుగా మార్చడంతో నీలినీడలు అలుముకున్నాయి. ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతుసేవా కేంద్రాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్‌గా రేషనలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.
ఇవీ కష్టాలు..
● రైతు సేవా కేంద్రాలకు
ఉరి వేసిన రాష్ట్ర ప్రభుత్వం
● రేషనలైజేషన్ పేరుతో
కొన్ని కేంద్రాల తొలగింపు
● రెండు, మూడు రోజుల్లో
రానున్న ఉత్తర్వులు
● వైఎస్సార్‌సీపీ హయాంలో
188 ఆర్‌బీకేల మనుగడ
● ఇక పోస్టుల భర్తీ, ఆర్‌బీకేల
మనుగడ లేనట్లే
ఆర్‌బీకేలో పనిచేయని డిజిటల్ కియోస్క్
కర్నూలు(అగ్రికల్చర్): రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించే రైతుభరోసా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి. వీటిని రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారే తప్ప ఎలాంటి సేవలు అందించడం లేదు. వాటికి అన్నదాతలకు దూరం చేసేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. గతంలో విత్తనం వేసే సమయం నుంచి మద్దతు ధరతో పంటను అమ్ముకునే వరకు అనేక సేవలు పొందిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్షకుల కష్టం రెట్టింపు అయ్యింది.
ఎక్కడి పనులు అక్కడే!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్‌బీకేలు(ఆర్‌ఎస్‌కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849, అర్బన్ ప్రాంతాల్లో 28 పనిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్‌బీకేలు సేవలు అందిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్‌బీకేలకు సొంత భవనాలు ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్‌బీకేలకు అపురూపమైన సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 393 ఆర్‌బీకేలకు కూడా సొంత భవనాలు నిర్మితం అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
పోస్టుల భర్తీ లేనట్టే
ఆర్‌ఎస్‌కే పరిధిలో ఉద్యాన పంటలు ఉంటే గ్రామ ఉద్యాన సహాయకుడు(వీహెచ్‌ఏ) ఉండాలి. మల్బరీ సాగైతే గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడు(వీఎస్‌ఏ) పనిచేయాల్సి ఉంది. వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయుడు( వీఏఏ) విధులు నిర్వర్తించాలి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామ పట్టుపరిశ్రమ సహాయకులందరికీ పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీఏఏలు 474, వీహెచ్‌ఏలు 215 ప్రకారం మొత్తం 689 మంది పని చేస్తున్నారు. మిగిలిన 188 పోస్టులను భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మూతపడినట్లే!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్‌బీకేలు(ఆర్‌ఎస్‌కేలు)ఉండగా రేషనలైజేషన్‌తో వీటిలో 188 కేంద్రాలు మూతపడినట్లే అని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేనందున ఆర్‌ఎస్‌కేలు కూడా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా 188 ఆర్‌ఎస్‌కేలు మూత పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటే రైతులకు సేవలు ఏ స్థాయికి దిగజారి పోతాయో ఊహించుకోవచ్చు.
2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్‌ఏ!
ప్రతి 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్‌ఏలు ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఈ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారిని నియమిస్తారు. వీఏఏ, వీహెచ్‌ఏ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఎంపీఇవోలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
● విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే
వరకు రైతుకు ఆర్‌బీకేలు అండగా నిలిచాయి.
● ఖరీఫ్, రబీ సీజన్లలో ఆర్‌బీకేల ద్వారా రైతులకు విత్తనాలు
పంపిణీ చేసేవారు.
● వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఏపీఎంఐపీ, ఫిషరీష్,
మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల
కార్యాక్రమాలు ఆర్‌బీకేల ద్వారానే అమలయ్యాయి.
● ఆర్‌బీకేల్లో వ్యవసాయ విజ్ఞానానికి సంబంధించిన దాదాపు
50 పుస్తకాలతో మినీ లైబ్రరీ ఉండేది.
● ఆర్‌బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేసేవారు. ఏ ఎరువు
ఎందుకు ఉపయోగపడుతుందనే దానిపై అవగాహన కల్పించేవారు.
● డిజిటల్ కియోస్క్‌ల ద్వారా తమకు అవసరమైన రైతులు ఆర్డర్ చేస్తే
48 గంటల్లోనే సరఫరా అయ్యేవి.
● ఆడియో, వీడియోలతో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు,
సూచనలు ఇచ్చేవారు.
రేషనలైజేషన్ జరుగుతోంది
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్‌బీకేలు ఉన్నాయి. ప్రస్తుతం వీఏఏలు, వీహెచ్‌ఏలు కలిపి 689 మంది పనిచేస్తున్నారు. ఇందువల్ల ఆర్‌బీకేలు తగ్గే అవకాశం లేదు. వీఏఏలు, వీహెచ్‌ఏలు స్థానంలో ఎంపీఇవోలను వినియోగించుకుంటాం. రైతులకు సేవలు యథావిధిగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
– పీఎల్ వరలక్ష్మి,
జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు
2014నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అవే కష్టాలు ఎదురవుతున్నాయి.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. కల్తీ విత్తనాలు విజృంభిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో నకిలీ కంది విత్తనాలతో నష్టపోయిన రైతులు పత్తికొండలో ఆందోళన చేపట్టారు. అలాగే గతేడాది ఖరీఫ్ సీజన్‌లో జూపాడుబంగ్లా, గడివేముల, మిడుతూరు మండలాల్లోని రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు.
పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి పట్టణాలకు
వెళ్లాల్సి వస్తోంది.
ఆర్‌బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ
అనుబంధ శాఖలకు సంబందించిన సేవలను పొందడానికి కియోస్క్‌లను
వినియోగిస్తారు. అయితే ఇవి నిరుపయోగంగా మారాయి.
రైతుల నుంచి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసే
ఆర్‌బీకేలు అసలు లేవు.
పంటలు పండకపోయినా రైతులను పలకరించే వారు కరువయ్యారు.