
ఆర్‌బీకేలు ఉన్నా లేనట్టే!
మాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో కంది, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఆర్‌బీకే మాకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్‌బీకేలు లేనట్లుగా ఉన్నాయి. ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కోడుమూరుకు, వెల్దుర్తికి వెళ్లాల్సి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్‌బీకేలను నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది.
– ఎం.మాదన్న, ఎస్‌హెచ్ ఎర్రగుడి,
కృష్ణగిరి మండలం
ప్రభుత్వం
చొరవ తీసుకోవాలి
గత ఏడాది మే నెల వరకు రైతుభరోసా కేంద్రాలతో అన్ని రకాల సేవలు పొందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆర్‌బీకేలు పనిచేయడం లేదు. గత ఏడాది వరకు ఎరువులు/ పురుగు మందులు ఏదీ అవసరమైనా నిమిషాల వ్యవధిలోఆర్‌బీకే ద్వారా పొందువారం. నేడు బస్తా ఎరువు కావాలన్నా... నీళ్ల మందులు కావాలన్నా డోన్‌కు, పత్తికొండకు పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– నౌనేపాటి, ముక్కెళ్ల, తుగ్గలి మండలం

ఆర్‌బీకేలు ఉన్నా లేనట్టే!