రక్తపరీక్షలు కూడా
చేయడం లేదు
నేను గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నా. కేంద్రంలోని వైద్యులు పరీక్షించి మందులు రాసిచ్చినా తగ్గడం లేదు. వైద్యపరీక్షలు చేయమని కోరితే ఇక్కడ పరీక్షలు చేసేవారు లేరు మరోసారి రమ్మని చెబుతున్నారు. తమ వద్ద డబ్బులు లేకపోవడం వల్లే పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని, ప్రాథమిక ఆరోగ్యానికి వస్తే కనీసం పరీక్షలు చేయడం లేదు. –దావీద్, క్రిష్ణగిరి
పీహెచ్‌సీల్లో తూతూమంత్రంగా వైద్యసేవలు
● మొక్కుబడిగా మందులు సరఫరా
● సకాలంలో రాని వైద్యులు, సిబ్బంది
● ప్రసవాలు ఎక్కువ శాతం సీహెచ్‌సీలు,
ఏరియా ఆసుపత్రుల్లోనే..
● రాత్రి వేళల్లో రోగులకు తప్పని ఇక్కట్లు
● మొలగవల్లి పీహెచ్‌సీలో శానిటరి అటెండర్ పోస్టు, రెండు వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 66 కాన్పులు చేశారు. 15 కి.మీల దూరంలో సీహెచ్‌సీ ఉన్నందున ప్రవసం కోసం అక్కడికి వెళ్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో 35 పాత పీహెచ్‌సీలు, 12 కొత్త పీహెచ్‌సీలు ఉన్నాయి. పాత పీహెచ్‌సీ భవనాల్లోనే కొత్త పీహెచ్‌సీ వైద్యులు, వైద్యసిబ్బంది ఉండి వారికి కేటాయించిన పీహెచ్‌సీల పరిధిలో పనిచేస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీలో 14 మంది చొప్పున వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంది. అయినా కూడా కొంత మంది విధులకు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లడం చేస్తున్నారు. కొందరు మధ్యలో వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి హాజరు వేసి వెళ్తున్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేయాల్సి ఉండగా 10 శాతం పీహెచ్‌సీలు కూడా పనిచేయడం లేదు. పీహెచ్‌సీల్లో నైట్‌వాచ్‌మెన్ లేరని సాకుచూపుతూ ఎవ్వరూ రాత్రివేళల్లో విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రసవాలకు, అత్యవసర వైద్యానికి సమీపంలోని సీహెచ్‌సీలకు, ఏరియా ఆసుపత్రులకు, కర్నూలు జీజీహెచ్‌ను ఆశ్రయిస్తున్నారు.
మందుల కొరత తీవ్రం
జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో మందుల కొరత కొన్నాళ్లుగా వేధించింది. గత నెలరోజుల నుంచి మందుల సరఫరా మెరుగుపడటంతో ఇప్పుడిప్పుడే ఆయా పీహెచ్‌సీలకు మందులు చేరుతున్నాయి. అందులోనూ గతంలో ఇచ్చినన్ని రకాల మందులు ఇప్పుడు ఇవ్వడం లేదు. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, షుగర్‌కు వాడే మందుల్లో కోత విధించారు. ఇన్సులిన్‌ను సైతం నెలరోజులుకు కాకుండా వారానికి ఒకటి చొప్పున ఇచ్చి పంపుతురు. దీనివల్ల వారం వారం రోగులు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది. ఇప్పుడు సరఫరా అవుతున్న మాత్రల్లో కూడా నాణ్యత ఉండటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రలు స్ట్రిప్‌లో నుంచి తీయగానే పొడిగా మారిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో మందుల నాణ్యతపై రోగుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రసవాలు కూడా తక్కువే..
జిల్లాలోని పీహెచ్‌సీల్లో ప్రసవాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. నెలలో మూడు నుంచి ఐదులోపు ప్రసవాలు జరుగుతున్న పీహెచ్‌సీలు కూడా జిల్లాలో ఉన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 20,479 ప్రసవాలు జరగ్గా అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,671(22.80శాతం), ప్రైవేటు ఆసుపత్రుల్లో 15,808(77.19శాతం) ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రులకు రావడానికి గర్భిణిలు ఇష్టపడటం లేదని వైద్యులు చెబుతున్నారు.
● కర్నూలుకు కూతవేటు దూరంలో ఉన్న గార్గేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యాధికారులు, ఒక సూపర్‌వైజర్, ఒక ఎంపీహెచ్‌వో, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్ ఉండగా ఇక్కడ ఒక మహిళా వైద్యాధికారి మినహా ఇతరులెవ్వరూ సమయపాలన పాటించడం లేదు. ఒకవేళ వచ్చినా ఆన్‌లైన్‌లో అటెండెన్స్ వేసుకుని కర్నూలుకు వెళ్లి వారి పనులు చూసుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అస్సలు తెరవడం లేదు.
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటుల
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటుల
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటుల
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటుల
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటుల
రోగమొస్తే వైద్యం చేయించుకోవడానికి గ్రామీణులకు అందుబాటుల