కలెక్టర్ బాలాజీ 126 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సానుకూల పరిష్కారం చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీ కోసం అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూసి సానుకూల ధోరణిలో పరిష్కరించాలని వివిధ సమావేశాల్లో ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నామన్నారు. ఇందుకోసం అధికారులు అర్జీలపై శ్రద్ధ చూపాలన్నారు. మీ కోసంలో అధికారులు 126 అర్జీలను స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని
మచిలీపట్నం నగర ప్రజలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ డిగ్రీ, బీఈడీ తదితర కోర్సుల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ కొడాలి శర్మ అర్జీ ఇచ్చారు.
● చల్లపల్లి మండలం రామానగరానికి చెందిన బీవీఎన్ రాణి తన తండ్రి ద్వారా సంక్రమించిన పెంకుటిల్లు పక్క స్థలంలో ఉన్న రిక్షా తొక్కే వ్యక్తి తమపై కోర్టులో వేసి రూ. 15 లక్షలు ప్రామిసరీ నోటును పుట్టించి ఆ మొత్తం చెల్లించిన తర్వాత అమ్ముకోవాలని తమకు నోటీసులు పంపారని కలెక్టర్‌కు దృషికి తీసుకువచ్చారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.


