అన్ ఎయిడెడ్ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశం
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని అన్‌ఎయిడెడ్ పాఠశాలల హెడ్‌మాస్టర్లు, కరస్పాండెంట్లతో జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు శనివారం డీఈఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పరీక్షపై చర్చా కార్యక్రమం ప్రాధాన్యతను వివరించి, విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచేలా పాఠశాలల్లో అమలు చేయాలని తెలిపారు. రాబోయే ఎస్‌ఎస్‌సీ పరీక్షలు–2026కు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ విజయ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల హెడ్‌మాస్టర్లు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
పెనమలూరు: గోసాలకు చెందిన వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ దొంగలు సొమ్ము కాజేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్‌ఐ ఫిరోజ్ కథనం మేరకు గోసాల గ్రామానికి చెందిన వ్యాపారి వి. రమేష్‌కి కొద్ది రోజుల క్రితం ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రెండు దఫాలుగా రూ.2,99,999 సొమ్ము సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


