 
															రేపటి నుంచి భవానీ మండల దీక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని డెప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేసిన పవన్‌కల్యాణ్ పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను డెప్యూటీ సీఎంకు అందించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కాటా ఆమ్రపాలి, కలెక్టర్ బాలాజీ, జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ పరిధిలోని వివిధ దేవస్థానాల్లో బేసిక్ వేతనంపై పని చేస్తున్న సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏ, డీఏ, వార్షిక ఇంక్రిమెంట్‌లు, ఐఆర్ వంటి అలవెన్సులు మంజూరు చేయాలని పవన్ కల్యాణ్‌కు ఆలయ సిబ్బంది వినతిపత్రం అందజేశారు.
పెనమలూరు: మండలంలోని యనమలకుదు రులో వేంచేసి ఉన్న శ్రీపార్వతి సమేత శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం సందర్శించారు. మంత్రి ఆలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జి.ఆర్.వి.సాగర్ పూజలు నిర్వహించారు. అనంతరం హోం మంత్రి అనితకు ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు ఆలయ ఫొటోను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.భవాని, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎన్‌యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు పేపర్‌కు రూ.770 చొప్పున, పీజీ కోర్సులకు పేపరుకు రూ.960 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల విభాగం కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, డెప్యూటీ రిజి స్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు పి. కృష్ణవేణి, డి.కోదండపాణి, సూపరింటెండెంట్ టి.వెంకటేశ్వర్లు, జవ్వాజి శ్రీనివాసరావు, మాధురి, దూర విద్య ఐసీటీ డివిజన్ డైరెక్టర్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
 
							రేపటి నుంచి భవానీ మండల దీక్షలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
