 
															సహాయక చర్యల్లో వీక్
ప్రచారంలో పీక్.. 
●వరి సాగు చేసినరైతులకు మిగిలేది అప్పులే
● వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా
అధ్యక్షుడు పేర్ని నాని
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ప్రచార ఆర్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వసమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యా లయం నుంచి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌తో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. తమ జిల్లాలో వర్షాల కంటే గాలి వల్ల ఎక్కువ పంట నష్టం జరిగిందన్నారు. పడిపోయిన పంటలను ఎత్తడం కూడా రైతులకు భారంగా మారుతోందన్నారు. ఒక మనిషి రోజుకు రూ.800 కూలి అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ పంట నష్టం అంచనాలు ఇప్పుడే మొదలు పెట్టారని తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దామని చెప్పారు. ఇరిగేషన్ కమిటీలన్నింటినీ అధికార పార్టీ వాళ్లే సొంతంగా రాసుకున్నారని, ఎలక్టెడ్ కాకుండా పంచుకు న్నారని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ప్రాథమికంగా జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా పెనమ లూరు, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మచిలీపట్నంలో వేరుశనగ దెబ్బతిం దని, వరి పంట వేసిన ఏ రైతూ కోలుకునే పరిస్థితి లేదని, అప్పుల్లో కూరుకుపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
