
ఏ రకమో గుర్తించడం ముఖ్యం
ఆర్థరైటిస్ 12 రకాలు ఉన్నాయి. వాటిలో రోగికి ఏ రకమైన ఆర్థరైటిస్ సోకిందో తెలుసుకుని మందులు వాడాల్సి ఉంటుంది. కొందరికి ఆరునెలలు, ఏడాది పాటు మందులు వాడితే తగ్గిపోతుంది. మరికొందరు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. లక్షణాలను తొలిదశలో గుర్తించి మందులు వాడితే దుష్పలితాలు లేకుండా చూడవచ్చు. కీళ్లనొప్పులు, వాపులు ఉండటం, ఉదయాన్నే వేళ్లు కీళ్లు పట్టేసినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలి.
–డాక్టర్ ఎన్.కావ్యాదేవి, రుమటాలజిస్ట్, విజయవాడ
●