మంచి మార్కులు సాధిస్తా | - | Sakshi
Sakshi News home page

మంచి మార్కులు సాధిస్తా

Oct 30 2025 9:12 AM | Updated on Oct 30 2025 9:12 AM

మంచి

మంచి మార్కులు సాధిస్తా

నవంబర్‌ మొదటి వారం నుంచి ఇంటర్‌ ప్రత్యేక తరగతులు సిలబస్‌ పూర్తి చేయడంపై అధ్యాపకుల దృష్టి గతేడాది ఫలితాల్లో రెండోస్థానంలో నిలిచిన జిల్లా

మా కళాశాలలో అధ్యాపకులు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. ఫస్టియర్‌ బైపీసీ గ్రూపులో 500 మార్కులకు 425 మార్కులు వచ్చాయి. ఈసారి సెకండియర్‌లో కూడా మంచి మార్కులు సాధిస్తా. ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకుంటా.

– వైష్ణవి

బైపీసీ సెకండియర్‌, మోడల్‌ స్కూల్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వ కళాశాలలపై దృష్టి సా రిస్తూ నవంబర్‌ మొదటి వారం నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. గతేడాది ఇంటర్‌ ఫలితాల్లో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెండోస్థానం నిలిచింది. ఈ ఏడాది మొదటి స్థానమే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. జూనియర్‌ కాలేజీల్లో వసతుల కల్పనకు ఇటీవల నిధులు మంజూరు కాగా, విద్యార్థుల హాజరులో పారదర్శకత కోసం ఫేషియల్‌ రికగ్నిజేషన్‌ సిస్టం అమలు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుతో గతంతో పోలిస్తే విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది.

ఉత్తమ ఫలితాల సాధనకు..

ఆరు సంవత్సరాలుగా ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా మొదటి, రెండు స్థానాలను కైవసం చేసుకుంటుంది. 2018– 19 విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో 71 శాతం ఉత్తర్ణతతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవగా సెకండియర్‌లో 80 శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో నిలిచింది. 2019–20లో ఫస్టియర్‌(68శాతం)లో 3వ స్థానం, సెకండియర్‌(75 శాతం)లో 2వ స్థానం, 2020– 21లో ఫస్టియర్‌(71 శాతం)లో 2వ స్థానం, సెకండియర్‌(80 శాతం)లో మొదటి స్థానం, 2021– 22లో ఫస్టియర్‌(70 శాతం)లో 3వ స్థానం, సెకండియర్‌(76 శాతం)లో 2వ స్థానం, 2022– 23లో ఫస్టియర్‌(74 శాతం)లో 3వ స్థానం, సెకండియర్‌(81 శాతం)లో 2వ స్థానం, 2023– 24 ఫస్టియిర్‌(61 శాతం)లో 4వ స్థానం, సెకండియర్‌(81 శాతం)లో రెండోస్థానంలో నిలిచింది. ఇక గత విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో నిలవగా, సెకండియర్‌లో 84 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది అదే జోరును కొనసాగిస్తూ ఉత్తమ ఫలితాల సాధనకు డీఐఈవో రాందాస్‌ ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు.

కార్యాచరణ రూపొందించాం

గతేడాది కంటే ఈ విద్యాసంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందు కు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. వచ్చే నెల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని ప్రిన్సిపాళ్లతోపాటు అధ్యాపకులకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులు ఇష్టంతో చదువుతూ జీవితంలో కీలకమైన ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల్లో రాణించాలి.

– రాందాస్‌, డీఐఈవో

సందేహాలు నివృత్తి చేసుకుంటాం

గతేడాది ప్రత్యేక తరగతుల సమయంలో అధ్యాపకులు ఎంతో ప్రోత్సహించారు. ప్రత్యేక తరగతుల్లో సబ్జెక్టుల్లో సందేహాలు నివృత్తి చేసుకుంటాం. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం సీఈసీ గ్రూపులో 478 మార్కులు వచ్చాయి. ఈసారి కూడా మంచి మార్కులు సాధిస్తాను.

– చందన, సీఈసీ

సెకండియర్‌, మోడల్‌ స్కూల్‌

జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలులు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,577 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,048 చదువుకుంటున్నారు. గురుకుల, కస్తూరిబా గాంధీ, ఆదర్శ, ప్రైవేట్‌ కళాశాలలు 38 ఉండగా ఫస్టియర్‌లో 2,930 మంది, సెకండియిర్‌లో 2,746 ఉన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభం కానున్నాయి. అలాగే వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారం నుంచి లేదా మార్చి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. వార్షిక పరీక్షలకు విద్యార్థులను స న్నద్ధం చేసేందుకు వీలయినంత వేగంగా సిలబ స్‌ పూర్తి చేయనున్నారు. నవంబర్‌ మొదటి వా రం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అలాగే రోజువారీ, వారంతపు పరీక్షలు కూడా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నా రు. సాధారణ తరగతులకు అదనంగా నిత్యం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ ప్ర త్యేక తరగతులు కొనసాగనున్నాయి. విద్యార్థు ల అభ్యసన స్థాయిలను మూల్యాంకనం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ సారించనున్నారు.

మంచి మార్కులు  సాధిస్తా
1
1/4

మంచి మార్కులు సాధిస్తా

మంచి మార్కులు  సాధిస్తా
2
2/4

మంచి మార్కులు సాధిస్తా

మంచి మార్కులు  సాధిస్తా
3
3/4

మంచి మార్కులు సాధిస్తా

మంచి మార్కులు  సాధిస్తా
4
4/4

మంచి మార్కులు సాధిస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement