చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి
కాగజ్‌నగర్‌రూరల్: చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని కోసిని డ్యాంలో బుధవారం చేప పిల్లలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో అన్ని చెరువులు, డ్యాముల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. కోసిని డ్యాంను పర్యాటక స్థలంగా మార్చడానికి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు బాబురావు, బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు శివ, పుల్ల అశోక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


