కుష్ఠు నివారణకు కృషి చేయాలి
కౌటాల(సిర్పూర్): కుష్ఠు వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బృందం సభ్యులు సంపత్ అన్నారు. కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ కుష్ఠు రహిత సమాజం కోసం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సకాలంలో వైద్యం అందించి పూర్తిగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సకలరెడ్డి, అరుణ, వైద్యాధికారులు రాముల్ నాయక్, రాజేందర్, పవన్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


