కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
సిర్పూర్(టి): ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే పంటలకు మద్దతు ధర లభిస్తుందని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని టోంకిని, పారిగాం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే స్థలాలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి పూర్తిస్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్నిరకాల వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రహీమొద్దీన్, సిబ్బంది ఉన్నారు.


