తోటల పనులు ప్రారంభించాలి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్‌లోని 379, 380 కంపార్ట్‌మెంట్‌లో ఆక్రమణలు తొలగించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పథకం ద్వారా వెదురు, యూకలిప్టస్ తోటల పెంపకం పనులు ప్రారంభించాలని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ సూచించారు. తాళ్లపేట అటవీ రేంజి కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీవో, అటవీ శాఖ సిబ్బందితో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు 380 కంపార్ట్ మెంట్‌లో గిరిజనులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, డీఆర్వో సాగరిక, ఎఫ్‌ఎస్వో రాజేందర్ పాల్గొన్నారు.


