మధుకర్ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి
వేమనపల్లి: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో కారకులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కోరా రు. సోమవారం ఆయన మధుకర్ కుటుంబ స భ్యులతో కలిసి కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిశారు. మధుకర్ కు టుంబానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంపెల అజయ్‌కుమార్, నాయకులు సత్యనారా యణ, మధునయ్య, వెంకాగౌడ్, లస్మయ్య, ఏట వెంకటేష్, రవికుమార్ పాల్గొన్నారు.


