ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ఖానాపూర్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు శాంతినగర్ కాలనీకి చెందిన కోమటిపెల్లి నడిపి పోశెట్టి (50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సోమవారం ఉదయం గాంధీనగర్ శివారులోని నల్ల పోచమ్మ ఆలయ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


