గుర్తింపు ఎన్నికలు జరిగేనా..?
కాగజ్‌నగర్‌రూరల్: పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎంలో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని సిర్పూర్ పేపర్ మిల్లులోని 15 కార్మిక సంఘాలకు లేఖలు పంపించారు. యూనియన్ నాయకులు, ఎస్పీఎం యాజమాన్యంతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరుపనున్నారు.
2018లో మిల్లు పునఃప్రారంభం
2014లో సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడగా 2018లో జేకే యాజమాన్యం ప్రభుత్వ రాయితీతో పునఃప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతేడాది ఆగస్టులో ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్)ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు. రిటర్నింగ్ అధికారి పేరుతో మిల్లులోని కార్మిక సంఘాలకు వార్షిక నివేదికను సమర్పించాలని లేఖలు పంపారు. మిల్లులోని కార్మిక సంఘాల అండర్ టేకింగ్ సర్టిఫికెట్, అప్లియేషన్ సర్టిఫికెట్, యూనియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బైలాస్, వార్షిక రిటర్న్స్, ఖాతా బుక్, కార్మికుల మెంబర్‌షిప్, రిజిస్టర్ బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు, మినిట్స్ బుక్ తదితర వివరాలను డీసీఎల్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఆయా కార్మిక సంఘాలు తమ నివేదికలను అందజేశాయి. కానీ ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదు.
నష్టపోతున్న కార్మికులు
ఎస్పీఎంలో గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. మిల్లులో కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా లేదు. కార్మికుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా పండుగ సమయంలో యాజమాన్యం ఇష్టారీతిన బోనస్ అందిస్తోంది. గుర్తింపు యూనియన్ ఉంటే సమస్యల పరిష్కారానికి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు కార్మిక శాఖ అధికారులు మంగళవారం ఆదిలాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికలు త్వరగా నిర్వహించాలి
ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ చొరవచూపాలి. మంగళవారం ఉమ్మడి సమావేశానికి రావాలని లేఖలు పంపించారు. సమావేశంతో సరిపెట్టకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందించి ఒత్తిడి తెచ్చాం. ఈ మేరకు స్పందించి సమావేశం నిర్వహించడం సంతోషకరం. – కూశన రాజన్న,
ప్రధాన కార్యదర్శి, మజ్దూర్ యూనియన్(ఈ2510)
తగ్గిన పర్మినెంట్ కార్మికుల సంఖ్య
మిల్లులో 2013లో గుర్తింపు ఎన్నికలు జరుగగా అప్పట్లో 1,050 మంది పర్మినెంట్ కార్మి కులు ఓటర్లుగా ఉన్నారు. ప్రస్తుతం పర్మినెంట్ కార్మికులుగా 397 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిల్లులో స్టాఫ్, కాంట్రాక్టు కార్మి కులు, పర్మినెంట్ కార్మికులు, దినసరి కూలీ లు ఉన్నా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప ర్మినెంట్ కార్మికులకు మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు యాజ మాన్యం పర్మినెంట్ కార్మికుల తుది జాబితా ను కార్మిక శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మిల్లు యాజమాన్యం వివరా లు అప్పగించలేదు. దీంతో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది.
గుర్తింపు ఎన్నికలు జరిగేనా..?


