ఆసిఫాబాద్: సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పిట్టల సత్యనారాయణ మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడి వెనుక ఏ శక్తులు ఉన్నా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. అలాగే అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 22న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు నిట్టూరి శ్రీశైలం, మహేశ్, రాజయ్య, శంకర్, నక్క విజయ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.