
అండర్ ట్రయల్ కేసులపై సమీక్ష
ఆసిఫాబాద్‌రూరల్: అండర్ ట్రయల్ కేసులపై జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ మంగళవారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, డీఎస్పీ రామానుజంతో కలిసి సమీక్ష నిర్వహించారు. అండర్ ట్రయల్ కేసులకు సంబంధించి కక్షిదారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం కృషి చేయాలని సూచించారు. చార్జ్‌షీట్ వేసిన, వేయని కేసుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. బెయిల్ మంజూరైన వెంటనే నిబంధనల మేరకు నిందితులను విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలర్ ప్రేమ్‌కుమార్, డీసీఆర్‌బీ ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.