
సమస్యల పరిష్కారానికి కృషి
బెజ్జూర్(సిర్పూర్): ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని మర్దిడి గ్రామంలో బుధవారం పోతేపల్లికి చెందిన రౌతు మల్లేశ్‌కు రూ.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, సన్నబియ్యం పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బెజ్జూర్ మండలంలో దాదాపు రూ.కోటికి పైగా నిధులతో సీసీరోడ్లు నిర్మించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు జగ్గయ్య గౌడ్, విశ్వేశ్వర్, సామల రాజన్న, సురేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.