
ప్రతీ ఇంటికి తాగునీరు అందించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రతీ ఇంటికి మిషన్ భ గీరథ ద్వారా తాగునీరు అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికా సం పథకాన్ని సమర్థవంతంగా అమలు చే యాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. వారం రో జుల్లో పూర్తి చేయాలన్నారు. శివగూడ గ్రా మంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన బావి నిర్మాణ పనులను పరిశీలించారు. భగీ రథ నీటి సరఫరాను పరిశీలించారు. నల్లా నీ ళ్లు వస్తుండగా, బావి నీరు ఎందుకు తాగుతున్నారని స్థానికులను ప్రశ్నించారు. భూ గర్భ జలాల పెంపునకు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ డీవో వేణుగోపాల్, ప్రత్యేకాధి కారి వెంకట్, ఎంపీడీవో అంజద్‌పాషా, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వరరావు, ఏపీఎం జగదీ శ్వర్, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఈసీ అక్యానాయక్, టీఏ నాగోరావు పాల్గొన్నారు.