
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: అడవి పంది దాడిలో గాయపడిన ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించి, బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ అన్నారు. గత నెల 28న అడవి పంది దాడిలో గాయపడిన మండలంలోని కౌటగూ డ గ్రామానికి చెందిన కుమ్రం రాజుబాయి, కుమ్రం రవి, కుమ్రం ప్రేమలత కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం జిల్లా కేంద్రంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు కనీసం ఆటో చార్జీలకు కూడా డబ్బులు లేవన్నారు. అనంతరం డీఎఫ్‌వో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టాలని రేంజ్ అధికారిని ఆదేశించగా, బీట్ అధికారులు రాజేష్, ప్రభాకర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.