కాల్చొద్దు... కలియదున్నండి | - | Sakshi
Sakshi News home page

కాల్చొద్దు... కలియదున్నండి

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

వైరా/మధిర/బోనకల్‌: జిల్లాలోని పలుచోట్ల పంట అవశేషాలకు నిప్పు పెడుతుండడంతో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన పంట అవశేషాలకు నిప్పు పెట్టకుండా భూమిలో కలియదున్నడం ద్వారా కలిగే లాభాలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుచరితాదేవి వివరించారు. కోఆర్డినేటర్‌తో పాటు వివిధ మండలాల వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించిన వివరాలు..

మరో పంట వేయాలని..

వరి, మొక్క కోశాక వేరే పంట వేయడానికి తక్కువ సమయం ఉండడం, వ్యర్థాలు కుళ్లడానికి 20 రోజుల సమయం పడుతుండడంతో రైతులు అవశేషాలను కాల్చడానికి సిద్ధమవుతున్నారు. అయితే, టన్ను వరిగడ్డి కాల్చడం వల్ల 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియంను భూమి కోల్పోతుంది. ఇదేసమయాన 60 కిలోల కార్బన్‌ మోనాకై ్సడ్‌, 1640 కిలోల కార్బన్‌ డయాకై ్సడ్‌, 199 కిలోల బూది, 2 కిలోల సల్పర్‌ డయాకై ్సడ్‌ విడుదలై వాయు కాలుష్యం ఏర్పడుతుంది.

ఇలా చేస్తే మేలు..

వరిలో స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటే త్వరగా కోతలు ముగియగానే.. వ్యర్థాలను నేలలో కలియదున్నాలి. కొయ్య కాళ్లను భూమిలో కలియదున్నితే గడ్డి ద్వారా పోషకాలు తిరిగి నేలకు చేరతాయి. పొలం దున్నే 10 రోజుల ముందు గడ్డిని పొలంలో పరిచి నీరు అందించి, ఆ తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్‌ పాస్పేట్‌ చల్లితే భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయి పెరుగుతుంది. అంతేకాక వరి అవశేషాలను వర్మీ కంపోస్ట్‌ / బయోచర్‌ / బయోగ్యాస్‌ తయారీలో ఉపయోగించవచ్చు. అలాగే, వరి సాగు తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లెజ్‌ పద్ధతిలో సాగు చేస్తే మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement