నిజాయితీకి బహుమతి | - | Sakshi
Sakshi News home page

నిజాయితీకి బహుమతి

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

కరకగూడెం: కరకగూడెంనకు చెందిన రావుల ఓజస్వి రెండు నెలల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక పర్సు దొరికింది. అందులో పరిశీలించగా రూ.వేలల్లో నగదు, విలువైన చేతి గడియారం ఉంది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పగానే ఆయన తీసుకెళ్లి స్థానిక పోలీసులకు అప్పగించారు. కొద్దిసేపటికే ఆ పర్సు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు. తమ కష్టార్జితం తిరిగి దొరకడంతో వారి కళ్లల్లో ఆనందం చూడగానే ఓజస్వికి ఎంతో సంతోషం కలిగింది. అంతేకాక ఓజస్వి నిజాయితీని మెచ్చుకున్న ఆ దంపతులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. వెలకట్టలేని వస్తువులు దొరికినప్పుడు ఆశ కలిగినా.. వాటిని యజమానులకు ఇచ్చేసినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి గొప్పదని.. తద్వారా గౌరవం లభిస్తుందని చిన్నారి ఆ రోజే తెలుసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement