హిందూ సమాజ ఐక్యత అవసరం | - | Sakshi
Sakshi News home page

హిందూ సమాజ ఐక్యత అవసరం

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

బోనకల్‌: హిందువులు ఐక్యంగా ఉంటూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడాలని పలువురు సూచించారు. బోనకల్‌ మండల కేంద్రంలో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించగా డాక్టర్‌ జి.వీరభద్రం, పణిభట్ల రాజేశ్వరశాస్త్రి ముఖ్య అతిథులుగా మాట్లాడారు. యువత పెడదోవ పట్టకుండా సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని తెలిపారు. ఆ తర్వాత రామాయణం, మహాభారతంలోని పలు అంశాలను వివరించారు. అనంతరం హాజరైన వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్‌ బానోరతు కొండతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement