నేలకొండపల్లి: చెరుకు సాగు చేస్తున్న రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెరుకు అభివృద్ధి మండలి (సీడీసీ) చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని రాజేశ్వరపురంలో మధుకాన్ షుగర్, పవర్ ఇండస్ట్రీస్‌లో మంగళవారం రైతులకు సబ్సిడీపై బొదే సెట్లకు సంబంధించి చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. చెరుకు రైతుల సమస్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కేన్ కమిషనర్ రవీందర్‌రావు, మధుకాన్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కోటయ్య, రాజేశ్వరపురం సర్పంచ్ దండా రంగయ్య తదితరులు పాల్గొన్నారు.


