వైరా: ఉమ్మడి జిల్లాలోని నలుగురు దివ్యాంగులకు వైరా ఎస్‌ఐ పుష్పాల రామారావు చొరవతో హైదరాబాద్‌కు చెందిన నారాయణ సేవా సంస్థాన్ బాధ్యులు కృత్రిమ కాళ్లను సమకూర్చారు. వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన కొప్పుల రామకృష్ణారావు, గొల్లపూడికి చెందిన బంకా మల్లయ్య భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటకు చెందిన తుర్రం శ్రీరాములుతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీసాల వెంకటసత్యనారాయణ పలు కారణాల వల్ల ఒక్కో కాలు కోల్పోయారు. వీరి సమస్యను ఎస్‌ఐ రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన నారాయణ సేవా సంస్థాన్ బాధ్యులకు వివరించారు. దీంతో నలుగురికి కృత్రిమ కాళ్లను సమకూర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఎస్‌ఐని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


