ఉత్తమ సేవలకు ‘ప్రగతిచక్ర’ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ‘ప్రగతిచక్ర’ అవార్డులు

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

భద్రాచలంటౌన్‌/సత్తుపల్లిటౌన్‌: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న సిబ్బందిని ప్రోత్సహించేలా ‘ప్రగతి చక్ర’ అవార్డులు ఇస్తున్నట్లు ఆర్‌టీసీ ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ సరిరామ్‌ తెలిపారు. భద్రాచలం డిపోలో మంగళవారం జరిగిన సమావేశంలో రీజియన్‌ స్థాయిలో ఎంపికై న వారికి ఆయన అవార్డులు అందజేసి మాడ్లాడారు. అనంతరం రీజియన్‌ పరిధిలో 56 మంది డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్‌ఎం అవార్డులు అందజేశారు. ఇందులో సత్తుపల్లి డిపో నుంచి ఉత్తమ బస్టాండ్‌ అవార్డు ఎస్‌ఎం ఆనందం, అద్దె బస్సు డ్రైవర్లు ఎంఎస్‌.రావు, జీవీ.ప్రసాద్‌, పీవీబీ.రావుతో పాటు కండక్టర్లు యాదగిరి, మారేశ్వరరావు, గ్యారేజీ నుంచి సాయి శ్రీనివాస్‌, మాధవరావు, ధనుంజయ్‌ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, ఖమ్మం డీఎంలు జంగయ్య, రామయ్య, లక్ష్మీనారాయణ, శివప్రసాద్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement