రఘునాథపాలెం/తిరుమలాయపాలెం: రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆయిల్‌పామ్ వంటివి సాగు చేయాలని, తద్వారా ఏళ్ల తరబడి నికర ఆదాయం వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రఘునాథపాలెం రైతు వేదికలో ఉద్యాన పంటలపై ఏర్పాటుచేసిన సదస్సులో డీఏఓ పుల్లయ్య మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుతో 30ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడి, ఆదాయం ఉంటుందని తెలిపారు. ఆత్మ కమిటీ ఖమ్మం డివిజన్ చైర్మన్ దిరిశాల వెంకటేశ్వరరావు, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉద్యానవనాధికారి జి.నగేష్, ఏఓలు ఉమామహేశ్వర్ రెడ్డి, ఎస్‌వీకే.నారాయణ, డీఎంకే.శ్రీనివాస్, తాతా రఘురాం, ఏఈఓలు శివ, శ్రీకాంత్, వ్యాస్, శరణ్మయితో పాటు గోద్రెజ్ కంపెనీ మేనేజర్ ఏ.రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే, తిరుమలాయపాలెంలో నిర్వహించిన సదస్సులో జిల్లా ఉధ్యానశాఖ అధికారి మధుసూదన్ మాట్లాడారు. వ్యవసాయశాఖ జిల్లా ప్రత్యేక అధికారి శివానంద్, ఏడీఏ సతీష్ శాస్రవేత్త జమునారాణి, ఉద్యాన అధికారి పి.అపర్ణ, ఏఓ సీతారాంరెడ్డి పాల్గొన్నారు.
రద్దయిన సొసైటీ పాలకవర్గాలకే తిరిగి అవకాశం
హైకోర్టు ఆదేశాలతో బాధ్యత స్వీకరణ
ఖమ్మంవ్యవసాయం: కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను తిరిగి కొనసాగించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేసింది. రాష్ట్రంలో సహకార సంఘాల పాలకవర్గాలకు 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా, 2025 ఫిబ్రవరి 14నాటికి పదవీ కాలం ముగిసింది. దీంతో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించారు. అయితే, ఎన్నికలు జరిగే వరకు పాలకవర్గాలనే కొనసాగించాలని కొందరు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఏడాదికి పైగా కోర్టులో విచారణ జరగగా, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేకపోవటంతో తిరిగి సొసైటీ పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ కాగా సహకార శాఖ ఉన్నతాధికారులు పర్సన్ ఇన్‌చార్జ్‌లను ఉపసహరించుకొని పాత పాలకవర్గాలను కొనసాగించాలనే జిల్లా అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని వంద సహకార సంఘాల్లో రద్దయిన పాలకవర్గాలు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించాయి. అయితే,
వ్యాక్సినేషన్ మొదటి విడత విజయవంతం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో మీజిల్స్–రుబెల్లా వ్యాక్సినేషన్ మొదటి దశ విజయవంతమైందని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి ఈనెల 4వ వరకు 469శిబిరాలు నిర్వహించగా, 1,138 మంది పిల్లలకు టీకాలు వేశామని వెల్లడించారు. గంగారం, చింతకాని, మంచుకొండ, వేంసూరు పీహెచ్‌సీలు, శ్రీనివాసనగర్ యూపీహెచ్‌సీల పరిధిలో మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా గతంలో టీకాలు వేయించుకోని పిల్లల గుర్తింపులో ఆశా, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కాగా, వ్యాక్సినేషన్ రెండో విడత జూలై 20 నుండి 27 వరకు నిర్వహించనున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను టీకాలు వేయించాలని సూచించారు.
కమనీయంగా
రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామ య్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం జరిపించారు.
రూ.1.70లక్షల విలువైన వెండి పళ్లెం
శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి భద్రాచలం వాసి మద్దాల భవన్‌సాయి మెహర్ వెండిపళ్లెంమంగళవారం వితరణగా అందజేశారు. ఆయన 655 గ్రాముల వెండితో చేయించిన రూ.1.70లక్షల విలువైన పళ్లెంను స్వామి వారి పాదాల చెంత పూజల అనంతరం ఆలయ అధికారులకు అందించారు. అధికారులు కత్తి శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు.


