మత సామరస్యంతో బక్రీద్‌ జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యంతో బక్రీద్‌ జరుపుకోవాలి

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

ఖమ్మంక్రైం: బక్రీద్‌ పండుగను మత సామరస్యం, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. ముస్లిం మతపెద్దలు, మసీద్‌ కమిటీల సభ్యులతో సీపీ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, పశువులను తరలించేవారు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు, వదంతులు నమ్మకుండా, అలాంటివి వ్యాప్తి చేసే వారి సమాచారాన్ని తెలియచేయాలని సూచించారు. అంతేకాక అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్‌ 100లేదా సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే, ఇతర సమస్యలు ఉంటే కమాండ్‌ కంట్రోల్‌ నంబర్‌ 87126 59111కు సమాచారం ఇవ్వొచ్చని సీపీ వెల్లడించారు. ఈసమావేశంలో ఏసీపీలు రమణమూర్తి, మహేష్‌, సీఐలు కరుణాకర్‌, మోహన్‌బాబు, బాలకృష్ణ, ఎస్‌ఐ మౌలానా తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement
 
Advertisement
Advertisement