
బ్లడ్ బ్యాంక్‌లో డీఎంహెచ్‌ఓ తనిఖీ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని డాక్టర్స్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్‌ను డీఎంహెచ్‌ఓ బి.కళా వతిబాయి మంగళవారం తనిఖీ చేశారు. మహబూబాబాద్ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉమారాణి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణతో కలిసి తనిఖీ చేసిన ఆమె రక్తసేకరణ, నిల్వలకు ఉన్న వసతులు, రికార్డుల నిర్వహణను పరిశీ లించారు. శిక్షణ పొందిన వైద్యులు, సిబ్బందితో బ్లడ్ బ్యాంక్ నిర్వహించాలని సూచించా రు. డిప్యూటీ డెమో జి.సాంబశివరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ పాల్గొన్నారు.
‘సీగాచి’ ప్రమాదానికి
నిర్లక్ష్యమే కారణం
ఖమ్మంమయూరిసెంటర్: సంగారెడ్డి జిల్లా పాశ మైలారంలోని సీగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 45మందికి పైగా కార్మికులు మృతి చెందడం విషాదకరమని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన యాజమాన్యం నిర్లక్ష్యంతోనే జరి గిందని ఆయన ఆరోపించారు. యాజమాన్యాలు ఫ్యాక్టరీల నిర్వహణను విస్మరించడంతోనే పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈమేరకు మరణించిన వారికి రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించడమేకాక ప్రమాదంపై న్యాయ విచారం జరిపించి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగా రావు డిమాండ్ చేశారు.
మానసిక దివ్యాంగులకు అండగా..
ఖమ్మం లీగల్: పిల్లలు, మానసిక దివ్యాంగులకు న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలుస్తోందని సంస్థ జిల్లా సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావు తెలిపారు. పిల్లలు, దివ్యాంగుల హక్కులపై పారా లీగల్ వలంటీర్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలందరికీ బడికి పంపించేలా తల్లిదండ్రులకు, మానసిక దివ్యాంగులను సమాజంలో భాగమేనని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక ఎవరైనా వివక్షతకు గురైతే న్యాయ సేవా సంస్థ ద్వారా సాయం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు దేవకి శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్‌శర్మ, పద్మ ప్రసూన, దిలీప్‌కుమార్, శ్రీనాథ్, యుగంధర్ పాల్గొన్నారు
తహసీల్దార్ల బదిలీ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులను భర్తీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చింతకాని తహసీల్దార్ అనంతరాజు ఉద్యోగ విరమణ చేయగా ఆ స్థానంలో కలెక్టరేట్ ‘డీ’ సెక్షన్ సూపరింటెండెంట్ టి.కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అలాగే, చింతకాని డీటీ జి.వీరభద్రనాయక్‌ను ఖమ్మం ఐపీటీ రైల్వేస్‌కు ఖమ్మంకు బదిలీ చేయగా, అక్కడ ఉన్న జీఎన్‌కే.శర్మను కలెక్టరేట్ ‘డీ’ సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఇక ఎన్నికల సమయాన జిల్లాకు వచ్చిన పలువురు తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తుండగా, జిల్లా నుంచి ముగ్గురి వారి సొంత జిల్లాలకు కేటాయించారు. ఎస్.సంపత్‌కుమార్, వి.రాఘవరెడ్డిని మహబూబాబాద్‌కు, సీహెచ్.స్వామిని సిద్దిపేట జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని వరదయ్య నగర్‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అర్బన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.4వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బ్లడ్ బ్యాంక్‌లో డీఎంహెచ్‌ఓ తనిఖీ