మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన | - | Sakshi
Sakshi News home page

మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన

Jul 3 2025 5:36 AM | Updated on Jul 3 2025 5:36 AM

మహిళల

మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించే మహిళల విషయంలో తక్షణమే స్పందించాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. ఖమ్మంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆయన పెండింగ్‌ కేసులు, దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు తదితర అంశాలపై ఆరా తీశాక మాట్లాడారు. మహిళల భద్రతను ప్రథమ ప్రాధాన్యతగా తీసకుని వారు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అలాగే, మహిళలతో మర్యాదగా వ్యవహరించడమే కాక కళాశాలలు, పాఠశాలలు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను పోలీసు సిబ్బంది గస్తీ కాయాలని చెప్పారు. సీఐలు శ్రీహరి, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో

వేగం పెంచాలి

కారేపల్లి: అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సింగరేణి కేటాయించిన రూ.30 లక్షల నిధులతో చేపడుతున్న పనులను బుధవారం పరిశీలించిన ఆమె నాణ్యతపై దృష్టి సారించాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, బోర్డ్‌ మంజూరు చేసిన రూ.20.50 లక్షలతో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. కాగా, కళాశాలలో 200మంది విద్యార్థులు చేరడంపై ప్రిన్సిపాల్‌ విజయకుమారి, అధ్యాపకులను ఆమె అభినందించారు. అనంతరం కారేపల్లిలోని పోస్ట్‌మెట్రిక్‌ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వసతులు, మెనూపై ఆరా తీశారు. డీఐఈఓ రవిబాబు, స్పెషల్‌ ఆఫీసర్‌ నవీన్‌బాబు, ఎంపీడీఓ సురేందర్‌, ప్రిన్సిపాల్‌ విజయకుమారి, ఎంపీఓ రవీంద్రప్రసాద్‌, గ్రామకార్యదర్శి నెహ్రూ ఉన్నారు.

పెరుగుతున్న

రిజర్వాయర్‌ నీటిమట్టం

వైరా: మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద కారణంగా వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 18.4 అడుగులు కాగా, ప్రస్తుతం చేరుతున్న వరతో బుధవారం 16.3 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌ ఆయకట్టు కింద రైతులు వరినాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.

చేపల వేట నిషేధం

వైరా రిజర్వాయర్‌లో రెండు నెలల పాటు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్య అభివృద్ధి అధికారి తెలిపారు. చేపల పునరుత్పత్తి కాలమైనందున ఆగస్టు 31వరకు చేపల వేటపై నిషే ధం ఉంటుందని పేర్కొన్నారు. ఈమేరకు వలలు, బుట్టలు తొలగించి.. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా మత్స్య సహకార సంఘం బాధ్యులు పర్యవేక్షించాలని సూచించారు.

ఎరువు కృత్రిమ కొరత

సృష్టిస్తే చర్యలు

మధిర: జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు ఉన్నందున, ఎక్కడైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. మధిరలో బుధవా రం నిర్వహిచిన విత్తన, ఎరువుల దుకాణాల డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించడమే కాక అన్ని వివరాలతో రికార్డులు నిర్వహించాలని సూచించారు. అలాగే, యూరి యా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వాడేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆతర్వాత మండలంలోని పలు ఎరువుల షాపుల్లో తనిఖీ చేసిన డీఏఓ, రాయపట్నంలో పచ్చిరొట్ట వేసిన పొలాన్ని పరిశీలించారు. మధిర ఏడీఏ విజయ్‌చంద్ర, ఏఓ సాయిదీక్షిత్‌, ఏఈఓలు జిష్ణు, గురుమూర్తి, ఆత్మ కమిటీ సభ్యులు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన
1
1/2

మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన

మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన
2
2/2

మహిళల ఫిర్యాదులపై తక్షణ స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement