
బాగున్న రోడ్ల ధ్వంసం
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వీధుల్లో సీసీ, బీటీ రోడ్లు వేశారు. అయితే, టీచర్స్ కాలనీలో పరిశీలించగా కొత్తగా ఏర్పడిన కాలనీల వద్ద సీసీ రోడ్లు లేక చిన్నపాటి వర్షానికే మట్టిరోడ్లు బురదమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో 75 కి.మీ. మేర సీసీ రోడ్లు ఉండగా, ఇంకో ఐదు కి.మీ.పై గా నిర్మించాలి. దీనికి తోడు అవసరమైన చోట డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా రాజీవ్‌కాలనీలో అంతర్గత రహదారులు, డ్రెయినేజీల నిర్మాణంపై దృష్టి సారించారు. ఇకపోతే మిషన్ భగీరథ పేరుతో బాగున్న సీసీ రోడ్లను ఇష్టారీతిన తవ్వి వదిలేయడంతో చాలా చోట్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
●
ఆరు నెలలైంది..
మా అడపా సత్యనారాయణ వీధిలో ఆరు నెలల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ కోసం సీసీ రోడ్డును తవ్వారు. ఆపై మరమ్మతు చేయకపోవడంతో ఇంట్లో నుంచి వాహనాలను బయటకు తీసేందుకు ఇబ్బంది పడుతున్నాం. అలాగే, డ్రెయినేజీల్లో మురుగు సాగక దుర్వాసన వస్తోంది.
– చందు, అడపాసత్యనారాయణ వీధి, సత్తుపల్లి

బాగున్న రోడ్ల ధ్వంసం