
జిల్లాలో సరిపడా ఎరువులు
పెనుబల్లి: జిల్లా రైతాంగానికి ఈనెలలో కావాల్సిన మేర ఎరువులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. పెనుబల్లి రైతు వేదికలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయన మాట్లాడారు. అనంతరం పెనుబల్లి ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఎరువులు, పురుగుల మందుల డీలర్లతో సమావేశమై సూచనలు చేశారు. రైతులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువులను ఎవరైనా బ్లాక్ చేయాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఓ ఏవీఎస్‌ఎస్.రాజు, ఏఈఓలు నరేష్, భవాని, నర్మద పాల్గొన్నారు.