విద్యుత్‌ ఫిర్యాదులకు ‘చాట్‌బాట్‌’ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఫిర్యాదులకు ‘చాట్‌బాట్‌’

May 30 2025 12:14 AM | Updated on May 30 2025 12:14 AM

విద్య

విద్యుత్‌ ఫిర్యాదులకు ‘చాట్‌బాట్‌’

● వాట్సాప్‌ నంబర్‌ 79016 28348కు ఫిర్యాదు చేస్తే సరి ● స్థితిగతులు తెలుసుకునేలా ట్రాకింగ్‌

ఖమ్మంవ్యవసాయం: విద్యుత్‌ సంబంధిత సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచడమే కాక వినియోగదారులకు మెరుగైన సేవలందించే లా ఎన్పీడీసీఎల్‌ (నార్తర్స్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌) సాంకేతికతను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే సమస్యలపై అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ‘వాట్సాప్‌ చాట్‌బాట్‌’సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వాట్సాప్‌ నంబర్‌ను కేటాయించింది.

ఫిర్యాదు నమోదు ఇలా..

వినియోగదారులు తమ సెల్‌ఫోన్‌ నుంచి వా ట్సాప్‌ లో 79016 28348 నంబర్‌కు హాయ్‌ అని చాట్‌ చేయగానే టీజీఎన్పీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌కు స్వా గతం అని వస్తుంది. అందులో రిజిస్టర్‌ కంప్‌లైంట్‌, ట్రాక్‌ కంప్‌లైంట్‌, చాట్‌ విత్‌ ఏజెంట్‌ అని వస్తుంది. ఈ మేరకు రిజిస్టర్‌ కంప్‌లైంట్‌ ఎంచుకుంటే విత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, వితౌట్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌, ప్రీవియస్‌ మెనూ అని వస్తుంది. ఆపై విత్‌ యూనిక్‌ సర్వీస్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే వినియోగదారుడి సర్వీస్‌ వివరాలు వస్తాయి. ఆ వివరాలను సరిపోల్చుకున్నాక ఓకే చేస్తే సబ్‌ టైప్‌ లేదా చాట్‌ విత్‌ ఏజెంట్‌ అని వస్తుంది. ఇలా ఏజెంట్‌తో చాట్‌ చేస్తూ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు.

ఐడీ నంబర్‌.. ట్రాకింగ్‌

వినియోగదారులు చాట్‌బాట్‌లో చేసే ప్రతీ ఫిర్యా దుకు సంస్థ ఒక నంబర్‌ కేటాయిస్తుంది. అలాగే, సంబంధిత అధికారి వద్దకు ఫిర్యాదు చేరిందని సమాచారం కూడా అందుతుంది. ఆపై వినియోగదారులు ఆ నంబర్‌ ఆధారంగా సమస్య పరి ష్కారం ఏస్థాయిలో ఉందో చాట్‌బాట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే, సమస్య పరిష్కరించాక వినియోగదారునికి సమాచారం ఇవ్వడమే కాక ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఫోన్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ సీకరిస్తారు. ఒకవేళ వినియోగదారులు సంతృప్తి చెందకపోతే మరోమారు కంప్‌లైంట్‌ రీ ఓపెన్‌ చేసుకోవచ్చు. అలాగే www. tgnpdcl. com వెబ్‌సైట్‌లో కనిపించే వాట్సాప్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి చాట్‌ చేయొచ్చు.

మరింత మెరుగైన సేవలకు..

వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించేలా సాంకేతికతను వినియోగించుకుంటున్నాం. ఇందులో భాగంగా మొబైల్‌ వాట్సాప్‌ నుంచి

సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. ఇదేకాక టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912 ద్వారా కూడా సేవలు పొందే అవకాశం ఉంది.

–ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఖమ్మం ఎస్‌ఈ

విద్యుత్‌ ఫిర్యాదులకు ‘చాట్‌బాట్‌’1
1/1

విద్యుత్‌ ఫిర్యాదులకు ‘చాట్‌బాట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement